జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్…
Bird Flu: ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.
Jharkhand : టెక్నాలజీ యుగంలో పాపులర్ అయ్యేందుకు యువత సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ను, లైక్స్ సంపాదించుకునేందుకు ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తున్నారు.
Jharkhand: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ రోజు అరెస్ట్ చేసింది. ఇటీవల మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి ఇంట్లో ఏకంగా రూ. 37 కోట్ల నగదు బయటపడింది.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్‌ను తాకబోతున్నాయి.
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్‌ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల…
లోక్ సభ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రధాని ఈరోజు జార్ఖండ్‌లోని సిమారియాకు వెళ్తున్నారు. ముర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి.