Amit Shah: మరి కొన్ని రోజుల్లో జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర మంత్రుల హవా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకోనున్నారు.
జార్ఖండ్‌లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు.
Jharkhand Floor Test: ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం తర్వాత స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమావేశానికి పిలిపించారు.
Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జనవరిలో హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఇటీవల జార్ఖండ్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆరోపించిన విధంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని హైకోర్టు వ్యాక్యానించింది.
నీట్ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను సీబీఐ ఈరోజు అరెస్ట్ చేసింది. డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్ నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్‌గా కూడా ఉన్నారు.
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు.
Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది.
జార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో అపశృతి చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ జిల్లాలోని దురులోని అప్‌గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఓ మహిళ సినిమా తరహాలో హత్యకు గురైంది. హత్య అనంతరం నిందితులు ఇంటికి నిప్పంటించి నగలు దోచుకెళ్లి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ చేయగా ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.