బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనేది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల ర్యాంకింగ్ ను వెల్లడిస్తుంది. ప్రతి బిలియనీర్ యొక్క నికర విలువల గురించి వివరాలను ఈ సంస్థ నిత్యం అందిస్తుంది.
ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..! ఇది నిజమే.. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారారు. టెస్లా షేర్లు భారీగా పతనం.. ట్విట్టర్ 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద తగ్గిపోయింది.. దీంతో సెకండ్ ప్లేస్‌కు వెళ్లిపోయారు..…
Amazon founder warned about recession: సొమ్ములే ఆదా.. చెయ్యరా భాయి.. డాబుకే పోక.. డబ్బు పోగెయ్యి.. అని తెలుగు రచయిత చంద్రబోస్ 20 సంవత్సరాల క్రితమే బడ్జెట్ పద్మనాభం అనే మూవీ కోసం ఒక చక్కని పాట రాశారు. అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎకానమీ ఏమంత బాగా లేదని, అందుకే అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం సవాళ్లు విసురుతోందని చెప్పారు.
Hold Onto Your Money, Jeff Bezos Warns Of Recession: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ఇలా పలు కంపెనీలు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్భనం, మాంద్యం భయాలతో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఇక్కడికే ఆగేలా కనిపించడం లేదు. మరిన్ని కంపెనీలు కూడా…
Jeff Bezos Charity: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపాదనపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన…
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష…