టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు…
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య విమర్శల పోరు పెరిగింది. తాజాగా జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందరూ జీవిత, రాజశేఖర్ లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అని జీవితా ఆగ్రహించింది. గత ఎన్నికలప్పుడు నరేష్ వెంట ఉండి, ఆయన ఏది చెప్తే అది చేసాం.. కానీ ఇపుడు తెలిసి…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్ తన మనసులో మాటలు బయటపెట్టేందుకు మీడియా ముందుకు వచ్చారు. జీవితా మాట్లాడుతూ.. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న జీవిత, తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని చెబుతోందని.. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో…
‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఈరోజు సమావేశయ్యారు. ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానించారు. దీంతో బండ్ల గణేశ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా భయంతో బ్రతుకుతున్న ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గర సమావేశపరచడాన్ని బండ్ల తప్పుబట్టారు. అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవితరాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్…
‘మా’ ఎన్నికల్లో ఈసారి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ అయితేనే మంచి చేస్తాడని నమ్ముతున్నానంటూ చెప్పిన బండ్ల గణేష్.. అనూహ్యంగా ప్రకాష్ ప్యానల్‌లోకి వచ్చిన జీవితా రాజశేఖర్ ను వ్యతిరేకిస్తూ బండ్ల బయటకు వచ్చారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘జీవితా అంటే నాకు వ్యక్తిగతంగా కోపం ఏమిలేదు.. ఆమె అంటే చాలా గౌరవం..…
(సెప్టెంబర్ 2న జీవిత రాజశేఖర్ పుట్టినరోజు)“కార్యేషు దాసి… కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తన భర్త డాక్టర్ రాజశేఖర్ ను హీరోగా నిలపడంలోనూ, స్టార్ హీరోని చేయడంలోనూ, అతని విజయానికి వెన్నెముకగా నిలచి జీవిత సాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో అలా సాగిన వారిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. తరువాత జీవిత, రాజశేఖర్…