ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు.