Bihar: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వమైన మహాఘటబంధన్‌కి తెరపడింది. మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, తన పాత మిత్రుడు బీజేపీతో కలిసి అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు జనవరి 28న జేడీయూ-బీజేపీల ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.
INDIA bloc: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, టీఎంసీ, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) వంటి పార్టీలు కూటమిలో కీలకంగా ఉన్నాయి. అయితే గతేడాది కూటమి ఏర్పడినప్పటికీ.. ఇప్పటికీ సీట్ల షేరింగ్‌పై కసరత్తు పూర్తి కాలేదు. కూటమికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సమావేశాలు జరిగాయి. అయినా సీట్లపై కసరత్తు కొలిక్కిరాలేదు.
కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిన్న నితీష్ కుమార్ శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
INDIA bloc: జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సమోసాలు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. ఢిల్లీ వేదికగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. అయితే ఇంతకముందు కూటమి సమావేశాల్లో టీ, సమోసాలు ఉండేవని, అయితే నాలుగో సమావేశంలో మాత్రం టీ, బిస్కట్లకే పరిమితమైందని పింటూ అన్నారు.
Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్‌కి మద్దతు తెలుపుతున్నాయి.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.