కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులను ఆయన ఇప్పటికే ఢిల్లీలో కలిశారు.