అయాచితంగా ఓనేతపై చేసిన విమర్శలకు కొంత కాలంగా ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు. అత్యంత సౌమ్యుడు… వివాదరహితుడుగా పేరుపొందిన ఆ విద్యావేత్తను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వదల బొమ్మాలి అన్న రీతి లో సదరు నేత వెంటపడుతుండడం ఇబ్బందికరంగా మారింది. భూ వివాదాలు… రాజకీయంగానే కాకుండా వ్యాపార లావాదేవీల అంతు తేలుస్తా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య ముదిరిన వివాదం…
ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ, టీడీపీ మధ్యే కాదు… టీడీపీ వర్సెస్ టీడీపీగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పుట్టపర్తికి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు.. మరో వైపు పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేతృత్వంలో స్వంత పార్టీ వారే నిరసనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే జేసీని…
అనంతపురం: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ముసలోడు అయినా చంద్రబాబే మేలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు పల్లెలన్నీ తిరుగుతున్నారని.. వాలంటీర్‌ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ జగనన్నను దీవించాలని ప్రాధేయపడుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీకి ఈరోజు కార్యకర్తలు లేరని.. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వెంట…
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…
జేసీ బ్రదర్స్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు మారుపేరు.. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తుంటారు.. అయితే, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది.. క్షమాపణలు చెప్పడంతో ఆ శిక్షలను సేవగా మార్చేసింది హైకోర్టు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న…
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిని అభివృద్ధి చేస్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జేసీ సోదరులు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రికి ఎక్కువ నిధులు కేటాయించారని, అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామన్నారు. అభివృద్ధి జరుగుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేసీ…
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం నాడు తన నివాసంలో ఫ్రీడమ్ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఆగస్టు 15 కాదు.. జనవరి 26 కాదు. మరి ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకున్నారో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇసుక వివాదం నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. దీంతో అప్పట్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా… పరిటాల కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2014 తర్వాత జేసీ కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వస్తోందని టాక్ నడిచింది. Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు…
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై సదస్సు జరిగిందని, దీనిని ఎలా తప్పు పడతారని ఎమ్మెల్యే కేశవ్ పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసులపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కేశవ్ కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి రాజకీయాలు ఇక్కడ చేస్తే తిరుగుబాటు…