ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాల సమయంలో ఇంట్లో ఉన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో పాటు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు… కాంట్రాక్టర్ చవ్వా గోపాలరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జేసీ ఇంట్లోకి ప్రవేశించిన ఈడీ అధికారులు సోదాలు చేపట్టడంతో..…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర హల్ చల్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రగతి భవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.. అయితే, అపాయింట్‌మెంట్ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.. కానీ, సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీ దివాకర్‌రెడ్డి… ఇక, పోలీసులు ఎంత…
రాయల తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వినిపించిన మాట. అప్పట్లో జేసీ దివాకర్‌రెడ్డి రాయల తెలంగాణ కోసం గట్టిగానే వాదించారు. ఆయన డిమాండ్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అదే పాటను కొత్తగా అందుకున్నారు జేసీ. ఎందుకలా? జేసీ ఆశిస్తున్నదేంటి? తెరవెనక ఎలాంటి మంత్రాంగం నడుపుతున్నారు? జేసీ మరోసారి రాయల తెలంగాణ చర్చకు పెడుతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్న సమయంలో సమైక్య ఆంధ్ర కోసం కొందరు ఉద్యమిస్తే.. మరికొందరు రాయల తెలంగాణ పల్లవి అందుకున్నారు.…
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం సీఎల్పీలోని తన పాత మిత్రులను కలిశారు. ఆ తరువాత జేసీ మీడియాతో ముచ్చటించారు. తెలంగాణను వదిలి చాలా నష్టపోయామని తెలిపారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓడిపోతాడని తాను ముందే చెప్పానని, ఎందుకో అందరికీ తెలుసునని అన్నారు. హుజురాబాద్ గురించి తనకు తెలియదని అన్నారు. ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని,…
రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి, పార్టీ శ్రేణుల దుస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పార్టీలో కాకరేపారు.. కొందరని ఉద్దేశిస్తూ పరోక్షంగా జేసీ కామెంట్లు చేయడంతో ఆ నేతలను నొచ్చుకున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో పెద్దపప్పూరు మండలం జూటూరులోని తోటలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కలిశారు శింగనమల తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ…