MLA Kethireddy Pedda Reddy Counter To JC Diwaka Reddy On Sand Reach: పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళనపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఇసుక రీచ్‌లకు అనుమతి ఉందో? లేదో? మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఇసుక రీచ్ వద్ద ఆందోళన చేశారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఆందోళనకరంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులను అడిగితే క్లారిటీగా చెప్తారన్నారు. ఇసుక అక్రమాలను తమ ప్రభుత్వం ఉపేక్షించేదే లేదని, అందుకే నిత్యం ఏదో ఒక గొడవ చేస్తుంటారని పేర్కొన్నారు.
Sachin Tendulkar: ‘RRR’ వల్లే ఇది సాధ్యమైంది: సచిన్ ట్వీట్ వైరల్
అంతకుముందు.. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను పాదయాత్ర చేస్తుంటే, జేసీ కరపత్రాలు పంచుతున్నాడని ధ్వజమెత్తారు. తన మీద, తన కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు పెడితే.. దానికి మూల్యం మీ ఇంటి నుంచి మొదలు అవుతుందని జేసీ సోదరులకు సవాల్ విసిరారు. తనని తాను జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీ అని చెప్పుకుంటున్నాడని.. ప్రతి వ్తెసీపీ కార్యకర్త, నాయకుడు కూడా రౌడీలేనంటూ తిరిగి జవాబిచ్చారు. జేసీ సోదరులపై ఉన్న కేసులపై చర్యలు తీసుకోకపోతే.. ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత అసలు జేసీ బ్రదర్స్‌కు లేదన్నారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందోనని ప్రశ్నించారు. పప్పుదినుసులను గుర్తు పట్టలేని లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే, అక్కడ కరువు వస్తుందని విమర్శించారు.
Kolagatla Veerabhadra: సీఎం జగన్ చెప్పినట్లు.. 175 స్థానాలకు 175 గెలిచి తీరుతాం
ఇదిలావుండగా.. పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద గురువారం నాడు జేపీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగిన ఆయన.. అక్రమంగా ఇసుక రీచ్ నిర్వహిస్తుంటే పోలీసులు, గనులశాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇసుక రీచ్ అనుమతులు ఉంటే చూపాలని.. లేకపోతే జేసీబీలను, టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీపీఆర్ మధ్య తీవ్ర వాదన నెలకొంది. దీంతో పోలీసులు ప్రభాకర్‌రెడ్డిని బలవంతంగా జీపులో ఎక్కించుకుని శింగనమలవైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో జేసీ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆ పరిస్థితిని అదుపు చేయడం, జేసీని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, బెయిల్‌పై ఆయన బయటకు రావడం అంతా జరిగింది.