VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయనే రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.