అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోలతో హల్చల్ చేసే జాన్వీ కపూర్, తరచుగా తిరుమల వెళ్తూ ఉంటుంది. అమ్మ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటని, అందుకే ఆమె లేకపోయినా తిరుమల వస్తూనే ఉంటానని జాన్వీ కపూర్ గతంలో చెప్పింది.…