ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.
గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది.. అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నాను అని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను.. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే నేను సీటు త్యాగం చేశాను..