Minister Dharmana Prasada Rao: రాష్ట్రంలో విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ, ధరలు పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అనకాపల్లి జిల్లాలో జరుగుతోన్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై వాస్తవాలు దాచిపెట్టి టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. 4,200 గ్రామాల్లో భూ సర్వే పూర్తయ్యింది.. టైటిల్ ఫ్రీ రికార్డులు రూపొందిస్తున్నాం అని తెలిపారు. 14 ఏళ్ల పాలన తర్వత ఇప్పుడు.. పవన్ కల్యాణ్, చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధి, కొత్త విధానాలపై చర్చించడం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు.. ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్ కు వద్దని మోసం చేసిన తనకు ఓటేయమని అడగడానికి చంద్రబాబుకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Anchor Suma: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన సుమ తాత.. ఎందుకో తెలుసా?
ఇక, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం వృథానో, నిధుల దుర్వినియోగమో చంద్రబాబు చెప్పాలని సవాల్ చేశారు ధర్మాన.. సంక్షేమ పథకాలను ఆక్షేపిస్తున్న చంద్రబాబు ఒక్క అవకాశం ఇస్తే అన్ని పథకాలు కొనసాగిస్తానని చెప్పడం మోసం కాదా..? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చెయ్యడం లేదని చెబుతున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పాలి..? అంటూ నిలదీశారు. సరాసరి ప్రజల జీవన ప్రామాణాలే అభివృద్ధి తప్ప బిల్డింగ్ లు కడితే అభివృద్ధి కాదు అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. కాగా, రాష్ట్రంలో అన్ని ధరలు పెంచేశారని విపక్షాలు ఫైర్ అవుతోన్న విషయం విదితమే.. పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్, డీజిల్.. ఇలా అన్నింటి ధరలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.