జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో తెలుగు దేశం- జనసేన పార్టీలు తొలిసారి సమావేశం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.
వైసీపీ పోవాలి.. జనసేన-టీడీపీ రావాలి ఇదే రకంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.. సీఎం పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమనేది నా భావన.. సీఎం పదవి వస్తే స్వీకరిద్దాం.. కానీ, దాని కంటే ముందు రాష్ట్రం ముఖ్యం: పవన్ కళ్యాణ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
Off The Record: పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన.. టీడీపీ నేతల్లో మాంచి ఊపు తెచ్చింది. చంద్రబాబు అరెస్ట్తో డీలా పడిపోయిన పార్టీకి ఓ విధంగా పవన్ తన పొత్తు ప్రకటనతో బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి. ఇదే సందర్భంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కొందరు నేతల్లో గుబులు పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడిగితే…. చంద్రబాబు కూడా కాదనలేక ఇచ్చేస్తే…. మా పరిస్థితేంటన్నది వారి ఆందోళన. తెలుగుదేశం…
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే ప్రకటించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది అన్నారు.