Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అంతకు ముందులా కాకుండా తనను, తన పార్టీని విమర్శించినవారిపై తనదైన మాటతీరుతో అలరిస్తున్నాడు. ఇక ఆయన నిజాయితీ నచ్చినవారు జనసేనలో జాయిన్ అవుతున్నారు. తాజాగా సీరియల్ నటుడు సాగర్.. జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. మొగలి రేకులు సీరియల్ తో నటుడు సాగర్ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. RK నాయుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సీరియల్ ఎంతగా గుర్తింపు తెచ్చింది అంటే.. సాగర్ కన్నా RK నాయుడు పేరుతోనే ఎక్కువగా ప్రాచుర్యం తెచ్చుకున్నాడు.
Lavanya Tripathi: రిస్పెషన్ లో హైలైట్ గా లావణ్య చీర.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఇక ఈ సీరియల్ తరువాత హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించిన సాగర్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నేడు పార్టీ కండువా కప్పి జనసేనలోకి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాగర్ ను ఆహ్వానించాడు. నటుడు సాగర్ స్వస్థలం రామగుండం నియోజకవర్గం.. రానున్న ఎన్నికల్లో రామగుండం అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి జనసేన గెలుపులో సాగర్ ఎలాంటి కృషి చేస్తాడో చూడాలి.