అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలకు సర్వేపల్లి నియోజకవర్గం అగ్నిపరీక్ష కానుంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరును టీడీపీ సీరియస్‌గా పరిశీలిస్తుండగా, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మళ్లీ నామినేట్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ ఇస్తే మూడోసారి పోటీ చేస్తానన్నారు. కాకాణి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2014లో 5,446, 2019 ఎన్నికల్లో 13,973 మెజారిటీతో రెండుసార్లు గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో…
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి…
రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే... ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.