జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.
ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఒకట్రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని జనసేన నేత జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో జనసేన నేత జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కె.వి.ఆర్ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకూ ర్యాలీ నిర్వహించారు.