BJP MP K. Laxman: ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందని, మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ K.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు.
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన…
ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో,…
రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య తీవ్ర రచ్చ జరుగుతుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తాజాగా.. ఎమ్మె్ల్సీ వంశీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చెంచా గాళ్లు అని అన్నది ఎంవీవీ చెంచా గాల్లని మాత్రమేనని అన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని.. దమ్ముంటే ఎంవీవీ తనతో మాట్లాడాలని అన్నారు. తన గురించి జగన్ తో తప్పుగా చెప్పి బ్యాడ్ చేసాడని తెలిపారు. ఎంవీవీకి ఓపెన్ ఛాలెంజ్…