సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు...ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.. భవిష్యత్తులో పెర్ఫార్మన్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరు మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశం తో ర్యాంక్ లు ఇస్తున్నారా.. లేకపోతే.. మంత్రులు కొన్ని అంశాల్లో వెనక బడ్డారని చెప్పడానికి ర్యాంక్ లు ఇస్తున్నారా..?
విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఒక లేఖ విడుదల చేశారు రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటినుంచే ఛాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో తన సోదరుడికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెబుతూ లేక విడుదల చేశారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి…
Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రెండు మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగడం ద్వారా ప్రజా తీర్పు వెలువడిందని అన్నారు.
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పిస్తారా..? లేదా..? మార్చిలోనే MLC అయ్యారు నాగబాబు. ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని 2024 డిసెంబర్లోనే ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి ఎందుకు ఇంత ఆలస్యం. నాగబాబు అమాత్య యోగానికి అడ్డం ఏంటీ..? పవన్ కళ్యాణ్కు వేరే ఆలోచన ఏమైనా ఉందా..?