వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని… 2007 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. read also : టీఆర్ఎస్లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ తెలంగాణ ఉద్యమ గడ్డ అని పేర్కొన్న పవన్ కల్యాణ్… కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన…
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా –…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి వెళ్తున్నారు. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఆయన పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కూడా పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగరానికి మూడు రోజుల క్రితమే వచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పన్నుల పెంపు, కృష్ణాజలాల వివాదాలపై పవన్ భేటీ అనంతరం స్పందించే అవకాశాలు ఉన్నాయి.…
నేడు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అయితే రేపు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల…
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గానికి జరగిన ఉప ఎన్నిక తరువాత జనసేన పార్టీ సైలెంట్ అయింది. కరోనా నిబంధనలు ఎత్తివేస్తుండటంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నేతలతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజయవాడలో పర్యటించబోతున్నారు. విజయవాడలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, రాష్ట్రంలో ప్రజలు…
ఏపీలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. ఇంతకీ సేనాని మౌనానికి కారణం ఏంటి? సినిమాలతో బిజీగా ఉన్నారా… కోవిడ్‌తో రాజీ పడ్డారా? ఏపీలో పెరిగిన బీజేపీ కార్యక్రమాలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు తగ్గింది. ఇదే సమయంలో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజా వ్యతిరేక…
నాడు గెలిపించిన పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ వన్. నేడు ఆయన కొనసాగుతున్న పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ 152. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నియోజకవర్గంలో గెలిపించిన పార్టీ వాళ్లు వదిలేశారు. పంచన చేరిన పార్టీ వాళ్లు పట్టించుకోవడం మానేశారు. కో- ఆర్డినేటర్లను మార్పించేసిన ఆ ఎమ్మెల్యే… నియోజకవర్గం కేడర్‌ను గెలవలేకపోతున్నారట. వైసీపీ కేడర్ దగ్గర కాలేదా? తూర్పుగోదావరిజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయాల్లో ఓ డిఫెరెంట్ నేత. అసెంబ్లీలో జనసేన…
జనసేన అధినేత,సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు…
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో పవన్ ఐసోలేషన్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మూడు రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని అయితే కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే…