వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర…
ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో…. బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు? 2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని సమస్యలపై ఆయన పోరాటం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళుతున్న సంగతి తెల్సిందే. ఇక ఆపార్టీకి చెందిన ముఖ్య నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అయితే గత సార్వత్రిక…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంపై నమ్మకం లేదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 222రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటి వరకు కనిపించలేదా… ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు. మీకు ఢిల్లీలో పలుకుబడి వుంది గట్టిగా చెప్పండి….ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడిగారు. అక్కడకు వెళ్లి కాళ్ళుపట్టుకుని-ఇక్కడ మీసం తిప్పుతావా… ఇక్కడమో బీజేపీతో గుద్దులాట…..అక్కడేమో ముద్దులాటనా అన్నారు. ప్రజలకు నమ్మకద్రోహం చేయవద్దు….చేతకాకపోతే చేతకాదని చెప్పండి .…
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. ఎంపీపీ అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకోవాలి అన్నా జనసేన సపోర్ట్ అవసరం కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీటీసీలకు ఆకర్షించేందుకు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ ఎంపీటీసీలు కీలకం కావడంతో జనసేన ఆ పార్టీ ఎంపీటీసీలను రహస్యప్రాంతానికి తరలించింది. ఇటు టీడీపీ…
తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆసక్తి కర కామెంట్స్ చేశారు… వైసీపీ నేతలు సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం భయపెట్టారని…. అందుకే పరిషత్ ఎన్నికలను టి.డి.పి బాయ్ కాట్ చేసిందని తెలిపారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే టి.డి.పి బలమేంటో చూపిస్తామని… వై.సి.పి ప్రభుత్వ తీరు పై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామని వెల్లడించారు. ఎం.పి.పి. స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే ఆయన “రంగస్థలం” వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. అయితే తాను అభిమానిని కాదు అని.. భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటాడు. కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా… బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా.. ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి.. తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నాడు. ఇక తాను…