ఆంధ్రప్రదేశ్లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు…
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు మాజీ మంత్రి కొడాలినాలి. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత పనిచేయాలని సూచించారన్నారు. గ్రాఫ్ పెంచుకోకపోతే… వారిని పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని చెప్పారాయన. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదన్నారు. విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ఆదేశించిన ఆయనచారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా…
మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు…. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటోంది. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక సినిమాలోనైనా.. రాజకీయాలల్లోనైనా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర” లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు..…
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే…
ఏపీలో మంత్రివర్గంలో శాఖలు మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తారన్న సమాచారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం…
ఆయన ఆ పార్టీలో నెంబర్ టు. కానీ.. నియోజకవర్గంలో కర్చీఫ్ వేసి.. కేడర్ కష్టాలను మర్చిపోయారట. అదే ప్లేస్ నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా… ప్రస్తుతం చుట్టపు చూపుగానే వస్తున్నారట. పార్టీలో నెంబర్ టు కావడంతో రాష్ట్రంలో ఏ సీటైనా తనకు వస్తుందనే లెక్కలో ఏమో పార్టీ శ్రేణులకు మాత్రం ఆయన వైఖరి అర్థం కావడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన అంచనాలేంటి? వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తారా? నాదెండ్ల మనోహర్.…
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.