జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్నారు పవన్. మార్గ మధ్యంలో పలుచోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. నంద్యాలలోను పవన్ కళ్యాణ్ పర్యటన వుంటుందని జనసేన వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో సిరువెళ్లలో 2.30 గంటలకు ముఖాముఖి వుంటుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు పవన్ కళ్యాణ్. సిరువెళ్లలో రచ్చబండ సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు.
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సిరవెళ్ళలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను అందించనున్నారు. పవన్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశాయి జనసేన వర్గాలు. తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందించనున్నట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందించనున్నట్టు ఆయన తెలిపారు.
Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!