జనసేన పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమ్నఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి..? ఆరోగ్య శ్రీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు..? అన్నింటికీ కారణం అభివృద్ధి లేకపోవడమే కారణం అన్నారు.. అమర్ రాజా సంస్థ, కియా అనుబంధ పరిశ్రమలు వైసీపీ చేసే గొడవకు వెళ్లిపోయాయని విమర్శించిన ఆయన.. గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేవ్.. టీడీపీ ఐదేళ్ల హయాంలో రూ. 53 వేల కోట్ల మేర మద్యం…
వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంపూర్థ మద్యపాన నిషేదం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీనైనా చితక్కొట్టిస్తాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం.. మరోసారి ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొంటామన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన.. ప్రతిపక్షంలోకి ఉండి అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే రాజధానిని రద్దు చేసిందన్నారు..…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా?…
గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కామెంట్ చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అదే, సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు మాకు ముఖ్యం అన్నారు.. సాంకేతికమైన సమస్యలను అధిగమించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన అవంతి.. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులే ఉంటారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పరమ భక్తుడు.. పవన్ ని దేవుడిలా కొలిచే బండ్లన్నకు పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో బండ్లన్నా ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కొంతమంది కేవలం బండ్ల స్పీచ్ వినడానికే వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవల భీమ్లా నాయక్…
సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ సాగుతోంది.. సీఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇక, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నమాట.. ఇక, రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన…
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ.. ఇవాళ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.. అయితే, జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్త. అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను తూ.గో. జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు. సాధారణంగా జనసేన కార్యకర్తలకు…