Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే.
వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.
భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్ చేశారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సింది ఉంది.. కానీ, ఉదయం జరగాల్సిన ఆ సమావేశం ఉన్నట్టుండి సాయంత్రానికి వాయిదా వేశారు.. సాయంత్రం 4 గంటలకు భీమవరంలో జనసేన నేతల మీటింగ్ ఉంటుందని తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ శ్రేణులు. అయితే, దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థతకు గురికావడమే కారణంగా తెలుస్తోంది
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు.
జనసేన అధికారంలోకి వస్తే బటన్ నొక్కడం ఉండదు.. రెల్లి కార్మికులు చెత్త ఊడ్చినట్టు అవినీతిని అంతం చేస్తామని జనసేన చీఫ్ అన్నారు. పులివెందుల రాజకీయం గోదావరి జిల్లాల్లోకి తీసుకు వస్తామంటే సహించేది లేదు అని పవన్ అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి అని ఆయన వ్యాఖ్యనించారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిమీద ఒకరు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన మీద .. పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకోపక్క జనసేనానిపై నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.
తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు.