వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభం కానుంది. 9న ఏలూరులో పవన్ కల్యాణ్ సభ జరుగుతుంది. రెండోదశ యాత్ర ప్రణాళికపై ఈరోజు జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. గత 14 న అన్నవరంలో తొలిదశ ప్రారంభమైంది. ఈనెల 9న ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.
Kakani Govardhan Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని.. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు.. ఇక, వెనుకవైపు లోకేష్ బాబు ఉండగా.. నాలుగో వ్యక్తిగా పాడె మోయటానికి పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, లోకేష్ బాబుకు వ్యవసాయ పంటల పేర్లు కూడా తెలియదు.. మరోవైపు చంద్రబాబు…
పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు మంత్రి రోజా.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కూ ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్ నిలబెట్టాలి అంటూ సవాల్ విసిరారు
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు.