నువ్వెంత నీ బ్రతుకెంత జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచీ మీడియాలో ఏం వాక్కుంటారో వాక్కోండి.. మేం ఏమీ మర్చిపోలేదు.. ఇదే పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెడతాం మీకు.. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం.. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.
టీడీపీ బలహీన పడిందని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారా?.. టీడీపీ పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు.. టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా?.. టీడీపీకి పవన్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి అని సజ్జల డిమాండ్ చేశారు.