ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సబ్ రీజియన్స్‌లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి…
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ…
Read Also: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువశక్తి పేరుతో రాష్ట్రంలోని యువత సమస్యలపై గళమెత్తనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఏడాది నుంచి పలు జిల్లాలలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 12న ఉదయం 11 గంటలకు ఈ బహిరంగ…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉండదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. పవన్‌కు రంగులు మార్చడం తేలికే కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2014…
Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.…
Pawan Kalyan: కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్‌లో వారాహి రంగు ఉండటం వివాదానికి కారణమైంది. వారాహి రంగుపై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలివ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలు అంటించారు. అయితే ఏదేమైనా ప్రస్తుతం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం…
Minister Roja: ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో… మరోవైపు సినిమాల్లో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్‌కు మనసులో ఉన్నా రాజకీయాలు డబ్బులతో ముడిపడి ఉండటంతో ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందించారు. దీని కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు వార్తలు వచ్చాయి. అటు ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ పవన్…
Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్‌డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల…
Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన…