Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్‌ని తెరపైకి తెచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన.. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు.. నేను కాపు నాయకుడిని కాదు.. నేను కుల ఫీలింగ్‌తో పెరగలేదు.. మానవత్వంతో పెరిగాను అన్నారు. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు.. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే…
Janasena:జనసేన పార్టీ సభ్య నమోదు గడువును పొడిగించింది.. మరో మూడు రోజుల పాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పొడిగించినట్టు ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్.. జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్న ఆయన.. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానం అన్నారు.. గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ…
CM YS Jagan Open Challenge: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ చాలెంజ్ విసిరారు.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం జగన్.. వరుసగా నాల్గో ఏడాది రైతు…
Pawan Kalyan Donation: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తోంది జనసేన పార్టీ.. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇక, వార్షిక సంవత్సరం ముగిసిన కొత్త 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కానుండడంతో.. జనసేన పార్టీ…
Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై అప్పుడే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. కలిసి నడవాలని భావిస్తున్నాయి.. అయితే, ఇదే సమయంలో టీడీపీ పొత్తు విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో.. జనసేన స్టాండ్ ఒకలా ఉంటే.. బీజేపీ స్టెప్పు మరోలా కనిపిస్తోంది.. ఈ సమయంలో పొత్తుల విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేట్…
Amanchi Swamulu: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం రేగుతోంది.. ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు బాపట్ల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చగా మారింది.. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజా కలకలానికి కారణమయ్యాయి.. పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన పార్టీ కార్యక్రమాలు.. ఇంత వరకు బాగానే ఉన్నా..…
Off The Record: గ్రంధి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా గత ఎన్నికల్లో నెంబర్ వన్ విజయాన్ని సాధించినా గుర్తింపు విషయంలో ఆయన స్థానం ఎన్నో నెంబరో అర్ధం కావడం లేదట. రెండుసార్లూ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ విషయంలో అసంతృప్తి లేకపోయినా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన్ని ఆవేదనకు లోను చేస్తున్నాయట. అధినేతని ఒప్పించి.. జనాన్ని మెప్పించినా రావాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదని గ్రంధి అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందట. గ్రంధికి ప్రాధాన్యం లేకపోవడం…
Pawan Kalyan: నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అధిష్టానం అప్పగించినప్పటి నుంచి పార్టీకి.. ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.. ఇక, తన భద్రతను కుదించడంపై ఆన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్…