తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్ సంకేతాలు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్…
తెలంగాణ కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నుండే మోస్ట్ సీనియర్స్ ఎక్కువ. కాంగ్రెస్‌కి పట్టున్న జిల్లా కూడా ఇదే. నాయకులు… నాయకత్వం ఎక్కువ ఇక్కడే ఉంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రిలీవ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌పై…
తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ. సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు…
రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు.…