ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్ కీలక వివరాలను వెల్లడించారు. జనార్ధన్ 2021 నుంచి నకిలీ మద్యం తయారీ వ్యాపారం చేస్తున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకొని అక్రమ మద్యం తరలించారు. మద్యాన్ని 35…