Senior Heroine Rashi: అందాల రాశి.. రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన ఆమె హీరోయిన్ గా మారి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం నో చెప్పుకుంటూ వచ్చింది.