జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామా రెడ్డి గూడెంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గోదావరి నీటిని మన ఇండ్లకు, పొలాలకు తెచ్చిన ఘనత మహానుభావుడైన సీఎం కేసీఆర్ ది. కాంగ్రెస్, బీజేపీ లు నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రజలని ఏనాడూ…