రాజమండ్రి అదికవి నన్నయ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను అవమానించారంటూ జన సైనికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ గేట్ బయట కట్టిన తమ ఫ్లెక్సీలు తొలగింపుతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన మహిళా నేత, ఎమ్మెల్యే బత్తుల సతీమణి వెంకట లక్ష్మిని యూనివర్సిటీ నిర్వాహకులు అడ్డుకోవడంతో వివాదం అయ్యింది. బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేసారని…