ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ నాయకుడు గతంలోనే ప్రకటించినా.. ఉపఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారో లేదో తెలియదు. కానీ.. ఆయన ఇద్దరు తనయులు మాత్రం చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరిగేస్తున్నారు. దీంతో పెద్దాయన దారెటు అని కేడర్‌లోనూ.. పార్టీలోనూ చర్చ మొదలైంది. వారసులను రంగంలోకి దించేశారా? కుందూరు జానారెడ్డి. చాలాసార్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వచ్చారు ఈ మాజీ మంత్రి. 2018లో నాగార్జునసాగర్‌లో ఓడిన…