కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో జానారెడ్డి ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఆపార్టీని ధిక్కరించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయనకు ఏదో ఒక మంత్రి పదవీ దక్కేది. అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన రికార్డు సైతం జానారెడ్డి పేరు పైనే ఉంది. తెలంగాణ కోసం పోరాడిన నేతగానూ ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో…