కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి జననాయగన్ రిలీజ్ వాయిదా వ్యవహారం తమిళ నాట సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్‌కు సంబంధించి దాఖలైన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటూ ఉండగా అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని, విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి కనిపించక పోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న సంక్రాంతి…