Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్‌సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Pakistan: పహల్గామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు, 28 మంది కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో ఉంది.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్‌కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.
Search operation begin in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై గురువారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ముందే ప్లాన్ చేసి.. కొండలపై నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పూంఛ్…