Inter-Caste Love Affair: ఇద్దరు ప్రేమించుకున్నారు.. విషయం పెద్దల వరకు వెళ్లింది. కులాలు వేరుకావడంతో పలుమార్లు పంచాయతీలు.. దాడులు.. కేసులు అయ్యాయి. మళ్లీ యధావిధిగా ప్రేమించుకున్నారు. ఇలా నాలుగేళ్లపాటు సాగిన ఈ వ్యవహారం చివరికి యువకుడి ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా కిషన్ రావు పేటలో జరిగింది దారుణం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ప్రేమించిన పాపానికి దళిత యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. కిషన్‌రావు పేటకి చెందిన సల్లూరి మల్లెష్ అనే దళిత యువకుడు.. 4 ఏళ్ల క్రితం వరి కోయటానికి హార్వెస్టర్ కొనుక్కున్నాడు. మున్నూరు కాపు కులానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో.. వరి కోయడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
Read Also:Thailand: బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసిన యువతి.. ప్రయివేట్ వీడియోలతో రూ. 102 కోట్లు వసూల్..
అలా ఆ యువతితో ఒక ఏడాది పాటు ప్రేమాయణం కొనసాగింది. ఇది తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు.. మల్లేష్‌ను మందలించారు. అయినా అతను ఆమెతో ఫోన్ లో మాట్లాడటంతో చేసేది ఏమి లేక అమ్మాయితో స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రేమ పేరుతో వేదిస్తున్నట్లు పిర్యాదు చేయించారు. గ్రామంలో పెద్ద మనుషుల మధ్య కూడా పలుమార్లు పంచాయితీలు పెట్టించారు. చివరికి మూడు సార్లు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. చివరగా 2022 లో మల్లేష్‌పై రౌడీ షీట్ కేసు కూడా నమోదు అయింది. అయినా మల్లేష్ ప్రేమ వ్యవహారంలో మార్పు రాలేదు. దీంతో అతనిపై దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు అయ్యి ఆస్పత్రి పాలై కోలుకున్నాడు.
Read Also:Keeway RR 300: స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. స్టైల్, స్పీడ్ కలయికతో కీవే RR 300 లాంచ్..!
ఆ తర్వాత యువతికి మల్లేష్ దూరంగానే ఉన్నాడు. కానీ, ఈ మధ్య మళ్లీ ఫోన్ చేసిన యువతి.. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. దీంతో యువతి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు మల్లేష్. ఐతే యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సర్ది చెప్పి పంపించారు. కానీ వినిపించుకోని మల్లేష్ మరోసారి గొడవకు వెళ్లాడు. దీంతో అతన్ని వెల్గటూర్‌కు తీసుకు వెళ్లారు అమ్మాయి కుటుంబ సభ్యులు.. కోటి లింగాలకు వెళ్లేదారిలో కత్తులతో పొడిచి చంపేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన మల్లేష్ బంధువులు మృతదేహంతో అమ్మాయి ఇంటి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు అడ్డుకుని 4 లక్షలు ఆర్ధిక సాయం ఇప్పించేలా ఒప్పించారు. దీంతో దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కేవలం కులం తక్కువ వాడు కావడం వల్లే మల్లేష్ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.