జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అయితే చాలు దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. మద్యం షాపుకే కన్నం వేసేందుకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.
సర్టిఫికెట్ల కేసులో జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి నల్గొండ పోలీసుల సోదాలు నిర్వహించారు. పట్టణంలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు. పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో.. ముంపునకు గురైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి సందర్శించేందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బయలుదేరారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో అరవింద్ కారుపై దాడి చేసారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. గతేడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు…
నేటి సమాజంలో కొందరు చిన్నచిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటు వారిని నమ్ముకున్న వారికి తీరని శోకంలో ముంచుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్ కు చెందిన తల్లీకూతుళ్ల వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో నిన్న ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లి వనజ (28), కుమార్తె శాన్వి (6) లు వరద కాలువ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ రోజు ఉదయం ఆత్మనగర్ వద్ద…
నేడు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా సుమన్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. సుమన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు…