నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే…