గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట…
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ…