జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ మధ్య తరగతి ప్రజలకు తీరనున్న సొంతింటి కల ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు, ప్లాట్లు కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేసే దిశగా జగన్ సర్కార్ పయనిస్తోంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు…