Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్‌లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్‌లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్‌పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి…
Yanamala: వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా…
CM Jagan: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కింద తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కిరూ.694 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. పేదరికం చదవుతోనే దూరమవుతుందని.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారని తెలిపారు. కానీ టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని…
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా…
NTR University: ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ…
Dharmana Prasad Rao: ఏపీలో వికేంద్రీకరణ అంశంపై రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం…
CM Jagan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో బారులు తీరారు. మూలా నక్షత్రం ప్రత్యేక రోజు కావడంతో ఏపీ సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు,…
BV Raghavulu: దేశ రక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం సీపీఎం దేశ రక్షణ భేరి నిర్వహిస్తోంది. విజయనగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపడుతోందని.. ఎందరో మంది వీరుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం అని బీజేపీ గుర్తించాలని బీవీ రాఘవులు సూచించారు. ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదా వారి…
CM Jagan: చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కుప్పంలో చంద్రబాబుపై ప్రజలు విసిగిపోయారని.. అందుకే 2019 తర్వాత కుప్పంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జెండాను ఎగురవేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గం బీసీలు పోటీ చేయాల్సిన సీటు అని.. కానీ చంద్రబాబు బీసీల సీటును లాక్కుని పోటీ చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి బీసీలను న్యాయం చేస్తాడని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. గత…