PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్…