ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు.