Minister KTR: నిజామాబాద్ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. తాజాగా నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధం చేసింది.