మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిన్న అర్థరాత్రితో ముగిసాయి. అయితే ఐటీ హై డ్రామాతో తన బంధువుల ఇంట్లో సోదాలు ముగియడంతో మంత్రి మల్లారెడ్డి పైర్ అయ్యారు. దొరికింది గోరంత అయితే ఐటీ డప్పు మాత్రం కొండంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారనిఆరోపణపై ఐటీ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో రెండు రోజుల ఐటీ సోదాలు చేపట్టింది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు.