టెహ్నాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కిలో గ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు తమకు అందిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. కానీ, ఆ వివరాలు బయటకు చెప్పడం కుదరదు అన్నారు. తాము హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను చంపేసిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీ మొదలు పెట్టిందని వెల్లడించారు.
Israeli PM: హమాస్ దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లాతో పోరాడి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నంది అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు.
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు.